"రాజా డీలక్స్" షూటింగ్ ని పక్కకు పెట్టిన ప్రభాస్

Prabhas Postpones Shooting of Raja Deluxe Movie | Telugu Movie News
x

"రాజా డీలక్స్" షూటింగ్ ని వాయిదా వేసిన ప్రభాస్

Highlights

Prabhas: "రాజా డీలక్స్" షూటింగ్ ని పక్కకు పెట్టిన ప్రభాస్

Prabhas: రాధే శ్యామ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ ను అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ను అనుకుంటున్నారు. డివివి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మాళవికా మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగష్టు కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్" మరియు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే" సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమా షూటింగ్ ల నుంచి ప్రభాస్ బయటపడడానికి కనీసం రెండు నెలలు పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ "రాజా డీలక్స్" సినిమా షూటింగ్ మరికొద్ది రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు సినిమా షూటింగులు చేయడం కష్టమైపోతుంది కాబట్టి ప్రభాస్ ఇలా చేశారట.

ఈ నేపథ్యంలో మారుతి మాత్రం దొరికిన సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అలానే సినిమాలో వాడాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా మారుతీ చూసుకుంటున్నారట. హారర్ సినిమా కాబట్టి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories