Prabhas Pan World Movie: 7కోట్ల 20 లక్షలు కెమెరా రెంట్..!!

బాహుబలి" చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో "రాధే శ్యామ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Sandeep Reddy
Published on: 4 July 2021 3:18 PM IST
Prabhas Pan World Movie 7 crore 20 Lakhs Camera Rent
X

ప్రభాస్ (ఫైల్ ఫోటో)

Prabhas Pan World Movie: "బాహుబలి" చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో "రాధే శ్యామ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నఈ చిత్ర యూనిట్ డబ్బింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క "ఆదిపురుష్" చిత్ర యూనిట్ తో ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఆ తర్వాత "మహానటి" చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ వరల్డ్ చిత్రంలో నటించబోతున్నాడు. అయితే అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ కి వాడే కెమెరా ఇపుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సైన్సు ఫిక్షన్ మరియు ఫాంటసీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని "ఏరీ అలెక్సా 65" కెమేరాతో షూటింగ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, అవెంజర్స్, కెప్టెన్ అమెరికా , మిషన్ ఇంపాసిబుల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో ఈ కెమెరాని ఉపయోగించారు. అయితే ఈ కెమెరాకి రోజుకు 7 లక్షల 20 వేల రూపాయలు అద్దె చెల్లించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా 100 రోజుల షూటింగ్ కి మొత్తంగా 7 కోట్ల 20 లక్షల రూపాయలను అద్దెకి తీసుకుంటున్నారని సమాచారం. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ త్వరలో పాన్ వరల్డ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. భారత సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఉపయోగించని ఈ కెమెరా మన టాలీవుడ్ సిని పరిశ్రమ నుండి మొదలుపెట్టడం విశేషం.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story