Prabhas New Movie: వీఎఫ్‌ఎక్స్‌ (VFX) క్వాలిటీ కోసం కోట్లు ఖర్చు

Prabhas: 'సాహో' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 'రాధే శ్యామ్' విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Venkata Chari
Updated on: 30 March 2021 4:30 PM IST
Prabhas New Movies Producers Radhe Shyam and Aadi Purush Ready to Spend High Budgets on VFX
X
ప్రభాస్ (ఫొటో హన్స్ ఇండియా)

Prabhas New Movie: సాహో చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాబోయే చిత్రం 'రాధే శ్యామ్' విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో బాక్సాఫీస్ వద్ద విఫలమైనా... ప్రభాస్ సినిమాలపై నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టేందుకు వెనుకాడడం లేదు. ఎంత ఖర్చు పెట్టైనా సరే పాన్ ఇండియా సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రభాస్ రాబోయే సినిమా 'ఆది పురుష్', నాగ్ అశ్విన్ తో తీయబోయే మరో సినిమా.. రెండూ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాయి. ఈ రెండు సినిమాల మొత్తం బడ్జెట్ వెయ్యి కోట్లకు పైగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'ఆది పురుష్' సినిమా కోసం రూ. 400 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని మేకర్స్ పేర్కొన్నప్పటికి, షూటింగ్ ముగిసే నాటికి బడ్జెట్ రూ. 500 కోట్లు దాటుతుందని తెలుస్తోంది. అలాగే, సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం మేకర్స్ రూ. 250 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసిన తొలి సినిమా 'ఆది పురుష్'. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సాంకేతికంగా పెద్దపీట వేయనుంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తీయనున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story