Project K Movie: రెండు వందల రోజుల పాటు డేట్లను ఇచ్చేసిన ప్రభాస్

* "మహా నటి" డైరెక్టర్ కోసం 200 రోజుల డేట్లు ఇచ్చిన స్టార్ హీరో

admin1
Updated on: 20 Sept 2021 8:40 PM IST
Prabhas Nag Ashwin Project K Movie Shooting Starts From November 2021
X

ప్రభాస్ - నాగ్ అశ్విన్ (ఫైల్ ఫోటో)

Project K Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు "సలార్" మరోవైపు "ఆదిపురుష్" సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ "మహానటి" సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కూడా ఒక ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. "ప్రాజెక్టు కే" అని పిలవబడుతున్న ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ మధ్యనే ఒక పది రోజుల పాటు సాగిన షూటింగ్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఇందులో అమితాబచ్చన్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.

తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వేగాన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకనిర్మాతలు. ప్రభాస్ ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు వందల రోజుల పాటు డేట్లను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. వచ్చే ఏడాది వరకు కూడా షూటింగ్ జరగనుంది. ఈ సినిమా షూటింగు పూర్తవడానికి 12 నుంచి 13 నెలలు పడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story