నాగార్జున సినిమా కంటే తక్కువ టీఆర్పి నమోదు చేసుకున్న ప్రభాస్ సినిమా

Prabhas Movie Registered Lower TRP than Nagarjuna Movie
x

నాగార్జున సినిమా కంటే తక్కువ టీఆర్పి నమోదు చేసుకున్న ప్రభాస్ సినిమా

Highlights

నాగార్జున సినిమా కంటే తక్కువ టీఆర్పి నమోదు చేసుకున్న ప్రభాస్ సినిమా

Prabhas Movie: "బాహుబలి" సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత విడుదలైన సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలు మాత్రం ప్రభాస్ రేంజ్ కి తగ్గ కలెక్షన్లు చేయలేకపోయాయి. అభిమానులు కూడా ఈ రెండు సినిమాల విషయంలో బాగా నిరాశ చెందుతున్నారు. కనీసం సాహో సినిమా తెలుగులో కాకపోయినా హిందీలో అయినా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.

కానీ రాధే శ్యామ్ సినిమా మాత్రం బాలీవుడ్ లో కూడా డిజాస్టర్ గానే నిలిచింది. తాజాగా రాధే శ్యామ్ సినిమా జీ తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రీమియర్ అయింది. సినిమా ప్రీమియర్ కి ముందు జీ తెలుగు వారు సినిమాని బాగానే ప్రమోట్ చేసారు. కనీసం ప్రమోషన్ల తర్వాత అయినా ప్రేక్షకులు సినిమాని చూస్తారని సాటిలైట్ ఛానల్ వారు ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమా మొదటి ప్రీమియర్ కి కేవలం 8.25 టిఆర్పిని మాత్రమే అందుకుంది.

ఇక "వకీల్ సాబ్" సినిమా 19 మరియు "బంగార్రాజు" 14 టి ఆర్ పి లను జనరేట్ చేశాయి. ఈ విధంగా చూస్తే ప్రభాస్ సినిమా కంటే నాగార్జున సినిమా మంచి టిఆర్పిని అందుకుంది. ఇక సాహో సినిమా 5.81 టీఆర్పిని మాత్రమే అందుకోగా గుణ369 5.91 అందుకొని సాహో కంటే ఒక అడుగు ముందే ఉంది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఇమేజ్ ఏమైపోతుందో అంటూ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories