రామ్‌ చరణ్‌ కూతురికి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్.. ‘కల్కి’కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన ఉపాసన

రామ్‌ చరణ్‌ కుమార్తె క్లీంకారకు మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది.

Arun Chilukuri
Updated on: 3 Jun 2024 4:00 PM IST
Prabhas Kalki Team Send Special Gifts To Ram Charan Daughter Klinkaara
X

రామ్‌ చరణ్‌ కూతురికి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్.. ‘కల్కి’కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన ఉపాసన

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్‌లు పంపుతోంది.

తాజాగా రామ్‌ చరణ్‌ కుమార్తె క్లీంకారకు మూవీ యూనిట్‌ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి - భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. కల్కి టీమ్‌కు థ్యాంక్స్‌, ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పిందీ మెగా కోడలు. ప్రస్తుతం బుజ్జి, భైరవ స్టిక్కర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా వీటిని మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా పంపనున్నట్లు తెలుస్తోంది.

ప్రచారంలో భాగంగానే తాజాగా ‘బుజ్జి అండ్‌ భైరవ’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ తీసుకొచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story