Kalki 2898 AD Glimpse: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. ప్రాజెక్ట్‌ కె గ్లింప్స్‌ వచ్చేసింది..

Kalki 2898 AD Glimpse: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) టైటిల్‌, గ్లింప్స్‌ వచ్చేశాయి.

Arun Chilukuri
Published on: 21 July 2023 12:45 PM IST
Kalki 2898 AD Glimpse Out
X

Kalki 2898 AD Glimpse: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. ప్రాజెక్ట్‌ కె గ్లింప్స్‌ వచ్చేసింది..

Kalki 2898 AD Glimpse: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) టైటిల్‌, గ్లింప్స్‌ వచ్చేశాయి. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ వేడుకలో చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించింది. దాంతో శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డుకెక్కింది. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అశ్వనీదత్‌తో పాటు రానా దగ్గుబాటి ఆ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ , అమితాబ్‌ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story