Prabhas: ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్

Prabhas: ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్

admin1
Updated on: 16 Feb 2022 2:00 PM IST
Prabhas is Going to Act with Three Heroines | Tollywood News
X

ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం "రాధే శ్యామ్" సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ మరోవైపు ఓం రౌత్ డైరెక్షన్ లో "ఆది పురుష్" అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో "ప్రాజెక్టు కే", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాని సైన్ చేశారు. "రాజా డీలక్స్" టైటిల్తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం కొన్ని మాత్రమే కాల్షీట్లు ఇచ్చారట. మారుతీ కూడా చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది వేసవి కాలం తర్వాత నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 50 రోజులు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story