మునుపెన్నడూ చూడని విధమైన సన్నివేశాల్లో ప్రభాస్.

మునుపెన్నడూ చూడని విధమైన సన్నివేశాల్లో ప్రభాస్.
x
Highlights

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సాహో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్...

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సాహో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలిసిన విషయమే. ఇప్పటికే విడుదలైన 'షేడ్స్ ఆఫ్ సాహో' రెండు చాప్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ 'సాహో' సినిమా కోసం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఇంతకుముందు ఎప్పుడూ తెలుగు సినిమాల్లో చూడనటువంటి విధంగా అద్భుతంగా ఉంటాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ ఇప్పటిదాకా నటించనటువంటి సరికొత్త పాత్రలో స్టైలిష్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు అని, తన నటన ఈ సినిమాలో ఫ్యాన్స్ కు కన్నులవిందు చేస్తుందని తెలుస్తోంది. శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంటే, నీల్ నితిన్ ముకేశ్, జాకీ శ్రోఫ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తూన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories