Prabhas: "రాధే శ్యామ్" ఈవెంట్ బాధితులకు సహాయం చేస్తున్న ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

admin1
Updated on: 30 Dec 2021 1:45 PM IST
Prabhas Helping Fans Who Injured at Radhe Shyam Pre Release Event | Tollywood News
X

Prabhas: "రాధే శ్యామ్" ఈవెంట్ బాధితులకు సహాయం చేస్తున్న ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది.

గత కొంతకాలంగా చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అని కూడా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో కృష్ణంరాజు కటౌట్ ఒకటి విరిగిపడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విరిగిపోయిన ఆ కటౌట్ అక్కడే ఉన్నా ప్రేక్షకుల్లో పడగా, వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే తాజాగా గాయపడ్డ వారి కోసం కొంత సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ప్రభాస్. దీంతో అభిమానులు ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story