Asia Most Handsome Men of 2021: 54 దేశాల్లో అందగాడిగా ప్రభాస్ రికార్డు

Sandeep Reddy
Updated on: 28 July 2021 11:53 AM IST
Prabhas Grabs The First Place in Asia Most Handsome Men of 2021 List
X

Asia's Most Handsome Men of 2021 - Prabhas 

Asia's Most Handsome Men of 2021: తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించిన రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడంతో పాటు ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ప్రాజెక్ట్ కే" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే అమితాబ్ బచ్చన్, దీపిక పదుకునే తో షూటింగ్ మొదలుపెట్టగా మరో రెండు రోజుల్లో ప్రభాస్ "ప్రాజెక్ట్ కే" షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం సలార్, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల్లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి మరో అరుదైన ఘనత లభించింది. అటు సినిమాల్లో రికార్డులతో పాటు తాజాగా ఆసియా ఖండంలో అందగాళ్ళ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.

మోస్ట్ హ్యాండ్సామ్ మెన్ ఆఫ్ ఆసియా 2021 విడుదల చేసిన పది మంది లిస్టులో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించడంతో ఆసియా ఖండంలోని 54 దేశాల్లో రెబెల్ స్టార్ మోస్ట్ హ్యాండ్సామ్ మెన్ ఆఫ్ ఆసియా 2021 అనే వార్తతో ప్రభాస్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. మొదటి స్థానంలో ప్రభాస్ ఉండగా, రెండవ స్థానంలో పాకిస్తాన్ కి చెందిన ఇమ్రాన్ అబ్బాస్, మూడో స్థానంలో జపాన్ కి చెందిన ఆకనిషి, నాల్గవ స్థానంలో సౌత్ కొరియాకి చెందిన కిమ్ హ్యున్ జూంగ్, అయిదవ స్థానంలో వియత్నాం కి చెందిన విహ్న్ లు, ఆరవ స్థానంలో చైనాకి చెందిన క్జియోమింగ్, ఇక ఏడవ స్థానంలో భారత్ కి చెందిన వివియన్ సేన అనే బుల్లితెర హోస్ట్ ఆ జాబితాలో స్థానం సంపాదించారు. ఇక ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో ఫవాద్ ఖాన్, వట్టనపుటి, వాల్లసు హువో లు ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story