Prabhas - Maruthi: మారుతి సినిమా ని హోల్డ్ లో పెట్టబోతున్న ప్రభాస్

Prabhas - Maruthi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు...

Shireesha
Updated on: 7 April 2022 8:30 PM IST
Prabhas Going to Hold Movie Raju Deluxe with Maruthi | Live News
X

Prabhas - Maruthi: మారుతి సినిమా ని హోల్డ్ లో పెట్టబోతున్న ప్రభాస్

Prabhas - Maruthi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈమధ్యనే "రాధే శ్యామ్" సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలానే బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఓం రౌత్ డైరెక్షన్ లో "ఆది పురుష్", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", నాగ్ అశ్విన్ దర్శకత్వం లో "ప్రాజెక్టు కే", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాని సైన్ చేసిన సంగతి తెలిసిందే.

"రాజా డీలక్స్" అనే టైటిల్తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి మార్క్ కామెడీ సినిమాలో ప్రభాస్ ను హీరోగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇదోక హార‌ర్ కామెడీ సినిమా అని వార్త‌లొస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కొన్ని రోజులపాటు ఈ సినిమాని హోల్డ్ లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్న ప్రభాస్ తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ ను గురించి ఒక క్లారిటీ తెచ్చుకుని ఆ తర్వాత ఈ సినిమా కోసం డేట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నరట. అప్పటిదాకా ఈ సినిమాను హోల్డ్ లో ఉంచనున్నారు దర్శక నిర్మాతలు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరానీ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Shireesha

Shireesha

Next Story