Prabhas: రెబర్ స్టార్ అరుదైన ఘనత.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే

Prabhas: రెబర్ స్టార్ అరుదైన ఘనత.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే
x

ప్రభాస్ ఫైల్ ఫోటో 

Highlights

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్నేషనల్ స్థాయిలో స్టార్‌డమ్ ఏర్పడింది.

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్నేషనల్ స్థాయిలో స్టార్‌డమ్ ఏర్పడింది.తాజాగా ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. సోషల్ మీడియా ఏ సౌత్ ఇండియా స్టార్‌కు లేని ఫాలోయింగ్ ప్రభాస్ కు వచ్చింది. ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవుతున్నవారి సంఖ్య 6 మిలియన్లకు చేరింది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన కొద్దీ రోజుల్లోనే ప్రభాస్ భారీ ఎత్తున ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు.

ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చాలా అరుదు. తన సినిమా అప్ డేట్ల గురించి అప్పుడప్పుడు స్పందిస్తుంటాడు. సోషల్ మీడియాలో మిగతా నటులతో పోల్చితే ప్రభాస్ యాక్టివ్ గా ఉండడం తక్కువే అయినా.. ఫాలోయింగ్ మాత్రం అదిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్ చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా హై బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.

కాగా, ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయానికొస్తే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ 10.4 మిలియన్ల ఫాలోవర్లతో ముందు వరసలో ఉన్నాడు. ఆ తర్వాత ప్లేస్ అల్లు అర్జున్ (10.2 మిలియన్లు), మహేశ్ బాబు (6.4 మిలియన్లు) నిలబెట్టుకున్నారు. ఇన్ స్టాలో చేరిన కొద్దీ సమయంలో ప్రభాస్ ఈ రేంజ్ లో ఫాలోవర్లను సంపాధించాడంతో త్వరలోనే వాళ్లు మించిపోవడం కష్టమేమి కాదు.


Show Full Article
Print Article
Next Story
More Stories