Radhe Shyam: థియేటర్‌ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు

Prabhas Fans Wounded at Karempudi Imax Theatre
x

Radhe Shyam: థియేటర్‌ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు

Highlights

Radhe Shyam: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి నిజంగానే పండ‌గ వ‌చ్చేసింది.

Radhe Shyam: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి నిజంగానే పండ‌గ వ‌చ్చేసింది. మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న న‌టించిన 'రాధే శ్యామ్' రిలీజైంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీతో వస్తుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద అపశృతి నెలకొంది.

ఈ ప్రమాదంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. థియేటర్‌ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్‌ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories