ఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్ అభిమానులు

Sita Ramam - Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా "రాధేశామ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Arun Chilukuri
Updated on: 9 Aug 2022 2:00 PM IST
Prabhas Fans Trolls Radhe Shyam Director
X

ఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్ అభిమానులు

Sita Ramam - Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా "రాధేశామ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమా విడుదల కి ముందు రాధేశ్యామ్ ఒక ఎపిక్ లవ్ స్టోరీ అవుతుందని క్లాసిక్ హిట్టుగా చరిత్రలో నిలిచిపోతుంది అంటూ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఎన్నో కామెంట్లు చేశారు.

దీంతో అభిమానులకి అంచనాలు కూడా రోజురోజుకీ పెరుగుతూ వచ్చాయి. కానీ విడుదలను తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎపిక్, క్లాసిక్ కాదు కదా కనీసం యావరేజ్ హిట్ గా కూడా నిలవలేకపోయిన రాధేశ్యామ్ బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులు రాధేశామ్ సినిమాని ఈ మధ్యనే విడుదలైన "సీతారామం" సినిమాతో పోలుస్తున్నారు.

దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజు నుంచి మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రేమ కథ అంటే "సీతారామం" అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎపిక్ ప్రేమ కథని ఎలా తీయాలో చెప్పడానికి "సీతారామం" సినిమా ఉదాహరణ అయితే ఎలా తీయకూడదు అని చెప్పడానికి రాధే శ్యామ్ ఉదాహరణ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story