ఆది పురుష్ సినిమా ప్రభాస్ ని గట్టెక్కిస్తుందా?

Adipurush Movie: ఆది పురుష్ పైన ఆశలన్నీ పెట్టుకున్న ప్రభాస్ అభిమానులు

Jyothi
Updated on: 25 Aug 2022 10:00 AM IST
Prabhas Fans Put all their Hopes on Adipurush Movie
X

ఆది పురుష్ సినిమా ప్రభాస్ ని గట్టెక్కిస్తుందా?

Adipurush Movie: రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సిరీస్ తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ఆ తరువాత మాత్రం ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయిందని చెప్పుకోవాలి. బాహుబలి తర్వాత వెంటనే ప్రభాస్ సాహో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా అంతంత మాత్రం గానే ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం మారు మ్రోగి పోయాయి. దానికి ఒకే ఒక కారణం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

చాలాకాలం తర్వాత ప్రభాస్ నటించిన ప్రేమ కథా చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదలయ్యాక మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. దశాబ్ద కాలంలో ప్రభాస్ అందుకున్న మొట్టమొదటి డిజాస్టర్ గా మారింది రాధే శ్యామ్. ఈ నేపథ్యంలో అభిమానులు అందరూ తమ ఆశలను "ఆది పురుష్" సినిమా పైన పెట్టుకున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story