"ఆది పురుష్" విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు

"ఆది పురుష్" విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు

Rama Rao
Updated on: 27 May 2022 6:30 PM IST
Prabhas Fans Disappointed With AdiPurush Movie | Tollywood News
X

"ఆది పురుష్" విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు

Prabhas Fans: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యనే "రాధేశ్యామ్" సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్, మరో వైపు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" ఈ సినిమాతో కూడా అంతే బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం నిర్మాణానంతర పనులు తో బిజీగా ఉంది.

అయితే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల లోకి వెళుతుంది అని టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే సినిమాకి రెండు సార్లు విడుదల తేదీలను మార్చారు. అయితే ఇప్పటికి కూడా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంకా బయటకు రాలేదు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

కనీసం రామాయణ ప్రత్యేక దినాలు శ్రీ రామ నవమి హనుమాన్ జయంతి వంటి రోజుల్లో కూడా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏవీ బయటకు రాకపోవడం అభిమానులు నిరాశకు గురిచేసింది. ఇలా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు డిసప్పాయింట్ అవుతూనే వచ్చారు. సినిమా మరొక ఐదారు నెలల్లో విడుదలకు కూడా కాబోతోంది కానీ ఇప్పటికీ కూడా సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాకపోవడం ఏంటి అని ప్రభాస్ అభిమానులు చిత్ర బృందం పై మండిపడుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story