Radhe Shyam: "రాధేశ్యామ్" మాస్ ప్రేక్షకులకి అర్థం కాదా?

Radhe Shyam: ఈసారైనా ప్రభాస్ మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాడా?

admin1
Updated on: 26 Oct 2021 4:15 PM IST
Prabhas Fans Confusion on Radhe Shyam Movie
X

రాధే శ్యామ్ సినిమా పై ప్రభాస్ ఫాన్స్ గందరగోళం (ఫైల్ ఇమేజ్)

Radhe Shyam: "బాహుబలి" వంటి సూపర్ హిట్ సినిమా తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా పాన్ ఇండియన్ గా మారిపోయాడు. అయితే తాజా సమాచారం ప్రకారం బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వచ్చిన ఇమేజ్ నీ ప్రభాస్ ఉపయోగించుకోలేక పోతున్నాం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అభిమానుల అభిరుచికి తగ్గ సినిమాలు ప్రభాస్ నుంచి రావడంలేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఉదాహరణకి "సాహో" సినిమా మొత్తం యాక్షన్ ఉంటుంది కానీ కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేది కాదు. ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా ఎక్కలేదు.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తదుపరి సినిమా అయిన "రాధేశ్యామ్" పైన కూడా అంచనాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఒక భిన్నమైన ప్రేమ కథ అని దర్శక నిర్మాతలు ఎంత హైప్ చేయాలని చూసినప్పటికీ అందులో మాస్ అభిమానులకు నచ్చేట్టుగా ఉంటుందా లేదా అని అభిమానులు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇక ఈ మధ్యనే విడుదలైన టీజర్ లో కూడా విజువల్స్ మ్యూజిక్ అన్ని అదిరిపోయే విధంగా ఉన్నప్పటికీ కాన్సెప్ట్ ఏంటి అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అందుకే ఇది కూడా మాస్ ప్రేక్షకులకి అర్థమయ్యే సినిమా కాదేమో అని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి "రాధే శ్యామ్" ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story