Tollywood News: మూడో సినిమా మొదలు పెట్టనున్న ప్రభాస్ డైరెక్టర్...

Tollywood News: ఇక ప్రస్తుతం తన మూడవ సినిమాని మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సుజిత్...

admin1
Updated on: 16 March 2022 5:01 PM IST
Prabhas Director Sujeeth Going to Make Third Movie in His Own Banner | Tollywood News
X

Tollywood News: మూడో సినిమా మొదలు పెట్టనున్న ప్రభాస్ డైరెక్టర్...

Tollywood News: "రన్ రాజా రన్" వంటి ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సుజిత్ రెండవ సినిమాకే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో "సాహో" వంటి ప్యాన్ ఇండియన్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమాకి నెగటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే హిట్ అయింది. ఇక ప్రస్తుతం తన మూడవ సినిమాని మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సుజిత్.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తేరి" సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఈ సినిమా టాక్స్ కూడా అవ్వలేదని తెలుస్తోంది. ఇక తన మూడవ సినిమా గురించి సుజిత్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

కానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు గ్రాఫిక్ డిజైనర్ లను వెతుకుతున్నట్లు గా ప్రకటించారు. అయితే మరోవైపు సుజిత్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ సైన్ క్రియేషన్స్ పతాకంపై ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరి తన మూడవ సినిమాతో అయినా సుజిత్ ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాలి.

admin1

admin1

Next Story