ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ తొలి ఫొటో చూశారా..!

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ తొలి ఫొటో చూశారా..!
x
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు ఇంస్టాగ్రామ్ లో అధికారిక ఖాతాను ఈ మధ్యనే ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కనీసం ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే ప్రభాస్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు ఇంస్టాగ్రామ్ లో అధికారిక ఖాతాను ఈ మధ్యనే ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కనీసం ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే ప్రభాస్ ఇంస్టాగ్రామ్ కు లక్షల్లో ఫాలోవర్లు వచ్చారు. ఇక తాజాగా ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో మొదటి ఫోటో ని పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 'బాహుబలి' సినిమా షూటింగ్ లోని ఒక స్టిల్ ను ప్రభాస్ పోస్ట్ చేయడం విశేషం. ప్రొఫైల్ పిక్ గా కూడా అదే పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం 'సాహో' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు కాబట్టి 'సాహో' సినిమా నుంచి పోస్టర్ ఏమైనా పెడతాడేమో అనుకుంటే 'బాహుబలి' స్టిల్ పెట్టి సర్ ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్.

ఇక ఈ ఫోటో పెట్టి కనీసం 24 గంటలు కూడా కాలేదు కానీ అప్పుడే ఈ ఫోటోకు రెండున్నర లక్షల లైకులు వచ్చాయి. చాలాకాలంగా ఫేస్ బుక్ లో ఉన్నప్పటికీ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్యనే అడుగుపెట్టాడు. ఇంకా ఎకౌంట్ వెరిఫై అవ్వక పోయినప్పటికీ మొదటి ఫోటో ని పోస్ట్ చేసినందుకు అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నాడు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.




Show Full Article
Print Article
Next Story
More Stories