logo
సినిమా

ఒక్క రోజుకి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Prabhas Charges Rs 1.25 Cr for one day for Raja Deluxe
X

ఒక్క రోజుకి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Highlights

Prabhas: "బాహుబలి" సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు.

Prabhas: "బాహుబలి" సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. ఇంతకు ముందు వరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోలెడు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఊహించని విధంగా రెమ్యూనరేషన్ కూడా అందుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 కోట్ల తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న సినిమాకి కూడా ప్రభాస్ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది నిజానికి మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా కోసం కేవలం 60 రోజులు కాల్షీట్లు మాత్రమే ఇచ్చారు ప్రభాస్. కానీ ఈ సినిమా కోసం ప్రభాస్ 75 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అంటే ఒక రోజుకి ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ 1.25 కోట్లు అన్నమాట. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. "ఉప్పెన" ఫేమ్ బ్యూటీ కృతి శెట్టి కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక మరోవైపు ప్రభాస్ సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె వంటి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

Web TitlePrabhas Charges Rs 1.25 Cr for one day for Raja Deluxe
Next Story