Prabhas: భారీ రెమ్యూనరేషన్ తో రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్

Prabhas: ప్రస్తుతం "రాధేశ్యామ్" విడుదల కోసం ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి.

admin1
Updated on: 24 Nov 2021 7:00 PM IST
Prabhas Charged Rs 150 Crore Remuneration for Adipurush?
X

Prabhas: భారీ రెమ్యూనరేషన్ తో రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్

Prabhas: ప్రస్తుతం "రాధేశ్యామ్" విడుదల కోసం ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టిన ప్రభాస్ "ఆది పురుష్", "ప్రాజెక్ట్ కే" మరియు "స్పిరిట్" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో చాలా వరకు సినిమాలని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ బీభత్సం గా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కి ఫ్యాన్ బేస్ పుట్టుకొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భూషణ్ కుమార్ ప్రభాస్ నీ లైన్లో పెట్టినట్లు సమాచారం.

ఇక మరోవైపు ప్రభాస్ బాహుబలి తర్వాత తన రెమ్యునరేషన్ను కూడా బీభత్సంగా పెంచేశాడు ప్రస్తుతం దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "స్పిరిట్" సినిమా కోసం మరియు "ఆది పురష్" సినిమాల కోసం ప్రభాస్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. సల్మాన్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ ల తర్వాత ప్రభాస్ మూడవ హయేస్ట్ పెయిడ్ యాక్టర్ గా మారారు. ఇక "ఆది పురుష్" సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉంది. మరోవైపు స్పిరిట్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆఖరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

admin1

admin1

Next Story