Prabhas: ఒక్క సినిమాతో ప్రభాస్ కెరియర్ ఆగిపోతుందా?

Prabhas Career With Radhe Shyam Film | Tollywood News
x

Prabhas: ఒక్క సినిమాతో ప్రభాస్ కెరియర్ ఆగిపోతుందా?

Highlights

Prabhas: ఒక్క సినిమాతో ప్రభాస్ కెరియర్ ఆగిపోతుందా?

Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత వరుసగా అదే రేంజ్ లో ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతకు ముందు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉండే ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ప్రభాస్ మళ్లీ తన సినిమా చాయిస్ ల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే "రాధే శ్యామ్" సినిమా యావరేజ్ గా నిలవడం తో హిందీలో ఇక ప్రభాస్ కెరీర్ ముగిసిపోయింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ సంపాదించిన క్రేజ్ అంత తొందరగా పోయేది కాదు. రాధే శ్యామ్ వంటి ఒక్క సినిమాతో ప్రభాస్ కరియర్ ముగిసిపోయేది కాదు. ఎందుకంటే ఇన్నేళ్ళు ప్రభాస్ పడ్డ కష్టం ఎక్కడికి పోదు. అయితే ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఇంకా బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ వంగా డైరెక్షన్లో చేస్తున్న స్పిరిట్, ఓం రౌత్ డైరెక్షన్లో చేస్తున్న అది పురుష్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మరియు మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ వంటి సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. కేవలం ప్రభాస్ ఇమేజ్ కారణంగానే ఈ సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories