Ravi Teja-Prabhas: రవితేజ నటించాల్సిన సినిమాలో హీరోగా మారిన ప్రభాస్

Ravi Teja-Prabhas: రవితేజ కోసమని రాసుకున్న కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్

admin1
Updated on: 3 Feb 2022 7:30 AM IST
Prabhas Became the Hero in the Upcoming Movie Ravi Teja | Tollywood News Today
X

రవితేజ నటించాల్సిన సినిమాలో హీరోగా మారిన ప్రభాస్

Ravi Teja-Prabhas: రొమాంటిక్ కామెడీ సినిమాలు తీయడంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మారుతి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాకపోయినప్పటికీ ప్రభాస్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని కొందరు చెబుతున్నారు. అయితే మరోవైపు మారుతి మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా ఇప్పటికే పూర్తి చేశారు.

మారుతి మార్క్ కామెడీ మరియు సెంటిమెంట్ ఈ సినిమాలో ఉండబోతొందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా మాత్రం పట్టాలు ఎక్కడం లేదు. రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ కథని నేరేట్ చేయమని అడిగారట. కథ వినగానే ప్రభాస్ ఈ సినిమాకి వెంటనే ఓకే చెప్పారని అని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కోసం రాసుకున్న కథ ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్నారు అన్నమాట. ఇక ఇప్పటికే ప్రభాస్ చేతుల్లో "సలార్", "ఆది పురష్", "స్పిరిట్", "ప్రాజెక్ట్ కె" వంటి చాలా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రభాస్ తో సినిమా చేయాలంటే మారుతీ కనీసం రెండేళ్లు ఆగాల్సిందే.

admin1

admin1

Next Story