Prabhas Beats Rajinikanth : రజినీకాంత్ ని బీట్ చేసిన ప్రభాస్?

Prabhas Beats Rajinikanth : రజినీకాంత్ ని బీట్ చేసిన ప్రభాస్?
x
Prabhas(File Photo)
Highlights

Prabhas Beats Rajinikanth : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా మూవీ స్టార్ గా ఎదిగాడు.. అప్పటివరకూ ప్రభాస్ కి

Prabhas Beats Rajinikanth : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా మూవీ స్టార్ గా ఎదిగాడు.. అప్పటివరకూ ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ ఒకెత్తు అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన ఇమేజ్ మరో ఎత్తు.. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు. బాహుబాలి తరువాత ప్రభాస్‌ చేసిన సాహో సినిమా ఆశించినంత స్థాయిలో హిట్‌ కాలేకపోయినా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది ఈ చిత్రం.. ఇక ప్రస్తుతం ప్రభాస్ కే రాధాకృష్ణ దర్శకత్వంలో రాథేశ్యామ్ అనే సినిమాని చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గానే తెరకెక్కుతుంది. ఈ సినిమాని వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకి గాను ప్రభాస్ రెమ్యునరేషన్‌‌గా 100 కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో సినిమాకు గాను రూ. 70 కోట్లు కాగా, డబ్బింగ్‌ రైట్స్‌ కోసం మరో రూ. 30 కోట్లు ప్రభాస్‌కు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటివరకూ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నది మాత్రం తెలుగులో ఎవరు లేరనే చెప్పాలి.. ఇప్పటి వరకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాత్రమే ఈ రెమ్యునరేషన్ తీసుకున్నారు.. దర్బార్‌ సినిమాకు గాను అయన రూ.70 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్‌ అంత పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించనున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుంది. డిసెంబర్ చివర్లో ఈ సినిమా పట్టాలేక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories