రాధేశ్యామ్‌ విషాద ప్రేమ కథేనా?

రాధేశ్యామ్‌ విషాద ప్రేమ కథేనా?
x
Highlights

Beats Of Radhe Shyam : నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా "బీట్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌"ని మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్.. నిమిషం పదహారు సెకండ్స్ ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Beats Of Radhe Shyam : నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా "బీట్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌"ని మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్.. నిమిషం పదహారు సెకండ్స్ ఉన్న ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మోషన్ ని పోస్టర్ ని ఒక్కసారి గమనిస్తే.. ముందుగా అరచేయి కనిపిస్తుంది. అందులో నుంచి పచ్చటి అడవి కనిపిస్తుంది. అందులో నుంచి రైలు ఒపెన్‌ చేస్తే అందులో ముందుగా ఫస్ట్‌ రోమియో-జులియేట్‌, ఆ తర్వాత సలీం-అనార్కలీ, ఆ తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. అలా ఆ తరవాత పూజ హేగ్దే బోగి డోర్‌ వద్ద నిల్చుని ఉంటే ప్రభాస్ ఆమెను చూస్తూ ఉంటాడు..

చూస్తుంటే అమర ప్రేమికుల నేపధ్యంలో ఈ సినిమా ఉండనుంది అని తెలుస్తోంది. మరి వీరి ప్రేమ విషాదంగా ముగుస్తుందా లేదా అన్నది చూడాలి. అటు ప్రభాస్ కూడా పూర్తి స్థాయి లవర్ బాయ్ గా కనిపించి చాలా రోజులు అవుతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఒక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి సినిమాతో జాతీయ అవార్డుని సంపాదించుకున్న నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కుతుండగా, సీ అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమా తర్వాత 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో అదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories