యంగ్ రెబెల్ స్టార్ తో సమంత

యంగ్ రెబెల్ స్టార్ తో సమంత
x
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ రెండూ కాకుండా ఈ మధ్యనే ప్రభాస్ దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమాకు ఒప్పుకున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించమని దిల్ రాజు ను సమంత సంప్రదించినట్లు తెలుస్తోంది. సమంత ఇంకా ఈ సినిమా పై నిర్ణయం తీసుకోవాలట. ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇప్పటిదాకా సమంత, ప్రభాస్ కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. ఒకవేళ నిజంగానే సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందంటే, ఇది ఖచ్చితంగా ఒక ఫ్రెష్ కెమిస్ట్రీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories