Adipurush: "ఆదిపురుష్" సినిమా వాయిదా పడుతుందా?

Adipurush: "ఆదిపురుష్" సినిమా వాయిదా పడుతుందా?

Arun Chilukuri
Published on: 22 Oct 2022 7:55 PM IST
Prabhas Adipurush Release Date Postponed ?
X

Adipurush: "ఆదిపురుష్" సినిమా వాయిదా పడుతుందా?

Adipurush: "సాహో", "రాధే శ్యామ్" వంటి సినిమాలతో అంతగా మెప్పించలేకపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా ఇప్పుడు "ఆదిపురుష్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే "ఆదిపురుష్" సినిమా వాయిదా పడితే బాగుంటుందేమోనని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" మరియు బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలు విడుదల కాబోతున్నాయి. విజయ్ హీరోగా నటిస్తున్న "వారసుడు" మరియు అజిత్ సినిమా కూడా ఒకటి సంక్రాంతి సందర్భంగా నే థియేటర్ లలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో "ఆదిపురుష్" సినిమా విడుదల అయితే కలెక్షన్లు డివైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అసలు ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ సినిమాకి కూడా కొంచెం మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వచ్చిన అన్ని సినిమాల వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రిస్క్ లేకుండా సినిమాని వాయిదా వేస్తే బాగుంటుందని కొందరు చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా కాకుండా వేసవిలో సినిమా విడుదల అయితే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story