ఆఫీషియల్ : ప్రభాస్ అదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆఫీషియల్ : ప్రభాస్ అదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్!
x
Highlights

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

Prabhas Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆఫీషియల్ గా వచ్చిన ప్రకటనతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమా నుంచి కీలక ప్రకటనను ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2020 ఆగస్టు 11 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించింది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అటు ఈ సినిమాలో కాస్టింగ్ భారీగానే ఉండబోతుంది. ఇప్పటికే రాముడిగా ప్రభాస్.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్.. ఇక మిగిలిన పాత్రల కోసం వేట మొదలు పెట్టారు.. ఇందులో సీత పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఖరారు కాలేదు.

ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. డిసెంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories