రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ప్రభాస్ మరొక సినిమా...

Prabhas: బాహుబలి సినిమా తో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా మారారు...

Shireesha
Published on: 27 March 2022 12:16 PM IST
Prabhas Adipurush Movie Going to Release in Two Parts | Tollywood News
X

రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ప్రభాస్ మరొక సినిమా...

Prabhas: బాహుబలి సినిమా తో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా మారారు. అయితే ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించి భారీ అంచనాల మధ్య విడుదలైన మరియు సాహో మరియు రాధే శ్యామ్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాయి. సాహో కనీసం కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించినప్పటికీ రాధేశ్యామ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను కలిగించింది.

అయితే తాజాగా ప్రభాస్ తదుపరి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేజిఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" సినిమా కూడా ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మొదట ఒక భాగాన్ని విడుదల చేసి తరువాత దానికి సీక్వెల్ గా మరొక సినిమాని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Shireesha

Shireesha

Next Story