Adipurush‌: ప్రభాస్‌ కొత్త లుక్ చూశారా..

Prabhas Adipurush Look Goes Viral on Social Media
x

ప్రభాస్ ఫోటో ట్విట్టర్

Highlights

Adipurush‌: ప్రభాస్‌ కొత్త లుక్‌ ను అభిమానులు #Adipurush పేరుతో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

Adipurush‌: డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో ఏకకాలంలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ "రాధేశ్యామ్‌" (Radhe Shyam) సినిమా ఫైనల్‌ షూటింగ్‌ జరుపుకుంటుండగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ "సలార్‌" రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక ఈ మధ్యే ఓం రౌత్‌ "ఆదిపురుష్‌" షూటింగ్‌ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ రాముడి అవతారంలో కనిపించనున్నట్లు టాక్.

ఇదిలా వుంటే ఈ సినిమా సెట్స్‌లో ప్రభాస్‌ను కలిసిన ఓ ఫ్యాన్.. హీరోతో ఫొటో దిగాడు. వెంటనే దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో కళ్లజోడు, తలకు క్యాప్‌ పెట్టుకుని ఉన్నాడు. ఇంకేంముంది ప్రభాస్‌ కొత్త లుక్‌ ను అభిమానులు #Adipurush పేరుతో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. రాముడిగా కనిపించేందుకు ప్రభాస్‌ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాడని, ఆ విషయం ఫొటో చూస్తే తెలిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్‌' నుంచి ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్‌ తెగ ఎదురు చూస్తున్నారు.

'ఆదిపురుష్'‌ సినిమాలో ప్రభాస్‌ శ్రీరాముడిగా, సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్‌(రావణుడు)గా కనిపించనున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో కృతి సనన్‌ను సీతగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్‌ మరో చిత్రం 'రాధేశ్యామ్'‌ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న రిలీజ్‌ కానుంది. ఆ తర్వాత పది రోజులకే అంటే ఆగస్టు 11న 'ఆదిపురుష్‌' విడుదల కానుండటం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories