Vakeel Saab Pre Release Talk : 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ టాక్

Pre Release Talk : ఇటీవల కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'వకీల్ సాబ్' ఒకటి.

Venkata Chari
Published on: 8 April 2021 7:43 PM IST
Pre Release Talk Vakeel Saab
X
వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్, శృతిహాసన్

Vakeel Saab Pre Release Talk: ఇటీవల కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'వకీల్ సాబ్' ఒకటి. కారణం, 3 సంవత్సరాల తరువాత పవర్ స్టార్ తెలుగు తెరపై కనిపించనున్నాడు. అజ్ఞాతవాసితో సినిమాలకు దూరమయ్యాడు. వకీల్ సాబ్ మూవీని దిల్ రాజు నిర్మించారు. శ్రీరామ్ వేను ఈ సినిమాను డైరెక్షన్ చేశాడు.

వకీల్ సాబ్ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా, ప్రీ-రిలీజ్ టాక్ చాలా పాజిటివ్ గా వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు / ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని ఫిల్మ్ యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. పవన్ కళ్యాణ్ నటనే ఈ సినిమాకు ప్రధానమని, పవర్ స్టార్ కమ్ బ్యాక్ సినిమా ఘనంగా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముందస్తు బుకింగ్‌లు కూడా జరిగాయి. అలాగే కొన్ని థియేటర్స్‌లో రానున్న మూడు రోజులకు టికెట్లు బుక్ అయ్యాయని తెలుస్తోంది. సో మొత్తానికి పవర్ స్టార్ మరోసారి రికార్డులను, బాక్సాఫీస్ ను షేక్ చేసేటట్లు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్.. దేశంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని గంటల్లో, యుఎస్ఏ ప్రీమియర్లు ప్రారంభమవుతాయి. కొద్ది సేపట్లో పూర్తి రివ్యూతో మీ ముందుకువస్తాము.

Venkata Chari

Venkata Chari

Next Story