Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్!

Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం.

Kranthi
Updated on: 20 April 2021 5:24 PM IST
Power Star Pawan Kalyan Tested as Corona Negative After Treatment
X

Pawan Kalyan: (File Image)

Pawan Kalyan: మూడ్రోజులుగా కరోనాతో బాధపడుతున్నజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా నెగెటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు రిపోర్ట్ నెగటివ్ వచ్చినట్లు తెలిసింది. మూడ్రోజుల కిందట పవన్ కళ్యాణ్‌కి అస్వస్థతగా అనిపించడంతో... టెస్టు చేయించుకున్నారు. అందులో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

దాంతో... హైదరాబాద్‌ దగ్గర్లోని తన వ్యవసాయక్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకున్నారు. జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనకు యాంటీ వైరల్‌ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ ఇచ్చారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. అన్నట్లుగానే ఆయనకు తాజాగా కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో... ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌కి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. అటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు పెట్టారు. ఐతే... పవన్‌కి కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో... ఆయన త్వరగానే కోలుకున్నారని తెలిసింది. తన రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' యూనిట్ సభ్యులతో పాటు తన భద్రత సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. దీంతో అభిమానాలు ఆందోళన చెందారు.

Kranthi

Kranthi

Next Story