Pawan Kalyan New Movie: పవర్ స్టార్ ద్విపాత్రాభినయానికి రంగం సిద్ధం?

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వెలువడున్నాయి.

Venkata Chari
Updated on: 27 April 2021 11:21 AM IST
Power Star Pawan Kalyan Plays Double Role in his New Movie | PSPK28 | Pawan Kalyan New Movie
X

పవన్ కళ్యాణ్, హరిష్ శంకర్ (ఫొటో ట్విట్టర్)

Pawan Kalyan New Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వెలువడున్నాయి. అయితే ఇది నిజమేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీఎస్ పీకే 28 (#PSPK28)తో ఇది నిజమవ్వనుందనే న్యూస్ వైరల్ కానుంది.

హరిష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నమోదైన విషయం తెలిసిందే. మరోసారి #PSPK28 తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే మరోసారి విజయం సాధించేందుకు కథను పక్కాగా తయారుచేస్తున్నారని సమాచారం. దీంట్లో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ చేయనున్నాడని, ఈమేరకు ఆ ప్రాతకు సంబంధించిన ఫొటో సెషన్ కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలోనూ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

మూడేళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా అంతే హైప్ ను క్రియోట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ లో భారీ వసూళ్లను సాధించిన వకీల్ సాబ్... కోవిడ్ వల్ల ఈ తరవాత వారాల్లో కొంత లాస్ లోకి వెళ్లింది.

ప్రస్తుతం తదుపరి సినిమాలపైనా దృష్టి సారించాడు పవన్. 'అయ్యప్పనున్ కోషియం' రీమేక్ తో పాటు హిస్టారికల్ కాన్సెప్టుతో రూపొందుతున్న 'హరి హర వీర మల్లు' సినిమాలతో బిజీగా మారాడు. కానీ, కోవిడ్ సోకి చికిత్స పొందుతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత హరీష్ శంకర్ #PSPK28 చేయనున్నారు. భారీ బడ్జెట్ తీ తీసే ఈ సినిమాలన్ని పవన్ కెరీర్ లో ఓ మైలురాయిలా నిలవనున్నట్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story