Vakeel Saabలో పవన్ ఫస్ట్ ఆఫ్షన్‌ కాదంట, మొదట అనుకున్న హీరో ఎవరో తెలిస్తే షాకే!

Vakeel Saab: పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Venkata Chari
Published on: 16 May 2021 11:45 AM IST
Power Star Pawan Kalyan Is Not The First Option Of Vakeel Saab Movie | Tollywood News Today
X

వకీల్ సాబ్‌లో పవన్ కళ్యాణ్ (ఫొటో ట్విట్టర్)

Vakeel Saab: పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ సినిమా 'పింక్' రీమేక్ గా తెలుగులో వకీల్ సాబ్‌గా విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగినట్లుగా డైరెక్టర్ వేణు శ్రీరాం కొన్ని మార్పులు చేశారు. వకీల్ సాబ్ బంపర్ హిట్ కొట్టి, పవన్ ఫ్యాన్స్‌ ఆకలిని తీర్చింది. థియేటర్లో ఆకట్టుకున్న ఈ సినిమా..ఇటీవలే ఓటీటీలో విడుదలై అలరిస్తోంది. బాక్పాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ ను రాబట్టింది. అనంతరం కోవిడ్ సెంకండ్ వేవ్ తో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.

తాజాగా వకీల్ సాబ్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది. వకీల్‌ సాబ్‌ మూవీలో ఫస్ట్‌ పవన్‌ కల్యాణ్‌ను హీరోగా అనుకోలేదట. యువరత్న నందమూరి బాలకృష్ణ అయితే ఈ పాత్రకు సెట్ అవుతాడని ముందుగా భావించారట. దీంతో వకీల్ సాబ్‌ స్టోరీ మొదట ఆయన వద్దకు వెళ్లిందంట. కానీ, ఈ స్టోరీని బాలయ్య బాబు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్టోరీని పవన్ కు వినిపించమని సూచించాడంట. దీంతో నిర్మాత దిల్ రాజు.. పవర్ స్టార్ ని కలిసి వకీల్ సాబ్ సినిమా చేసేందుకు ఒప్పించారని సమాచారం. ఇక ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల, ప్రకాశ్‌ రాజ్‌, శృతి హాసన్‌ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. దీనిని క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేస్తున్నాడు. అలాగే మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లోనూ నటిస్తున్నాడు. మరోవైపు బాలయ్య బాబు.. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 'అఖండ' సినిమాలో నటిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు పవన్‌.. క్రిష్‌ జాగర్లమూడితో కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మలయాళ సూపర్‌ హిట్‌ 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌' రీమేక్‌లో రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story