Pawan Kalyan: లెక్చరర్‌గా పవన్ ? హరీష్ శంకర్ స్కెచ్ మాములుగా లేదుగా..!

Power Star Pawan Kalyan Going to Play Lecturer Role in His Next Movie | Harish Shanker
x

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు తెలుగు రీమేక్ గా వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ తో 'హరి హర వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌ తో #PKPS28 ను డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసింది. ఈ చిత్రంలో పవన్ పాత్ర గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లెక్చరర్ పాత్రను పోషించబోతున్నారంట. 'వకీల్ సాబ్' సినిమాలో లాయర్‌గా కనిపించిన పవన్‌ను.. హరీష్ శంకర్ లెక్చరర్‌గా చూపించబోతున్నాడంట. ప్రస్తుతం ఈ వార్తపై ఎలాంటి అదికారిక సమాచారం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories