Power Star New Car: పవర్ స్టార్ నయా కార్..సోషల్ మీడియాలో హల్చల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు.

Sandeep Reddy
Updated on: 2 July 2021 2:54 PM IST
Power Star New Car: పవర్ స్టార్ నయా కార్..సోషల్ మీడియాలో హల్చల్
X

పవన్ కళ్యాణ్ నయా కార్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Pawan Kalyan New Car: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి ఉన్న క్రేజ్ , ఆ వ్యక్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇటు రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా 4.5 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ 3.0 ఎస్ వి ఆటోబయోగ్రఫీ కారుని కొనబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పటికే ఆ కార్ కొనడానికి ఆర్డర్ చేసాడని సమాచారం. "వకీల్ సాబ్' చిత్రంతో కలెక్షన్స్ సునామి సృష్టించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "అయ్యపన్ కోషియమ్" రీమేక్ చిత్రంతో పాటు "హరి హర వీరమల్లు" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మలయాళంలో ఘన విజయం సాధించిన "అయ్యపన్ కోషియమ్" చిత్ర రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో పాటు హీరో రానా, నివేత పెతురాజ్, నిత్యమినన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. మలయాళంలో బీజు మీనన్ నటించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్, పృథ్వి రాజ్ పాత్రలో రానా నటించబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుండగా తమన్ సంగీతాన్ని సమకుర్చనున్నాడు. మరోపక్క "హరిహర వీరమల్లు" చిత్రం కూడా త్వరలోనే షూటింగ్ ముగించుకొనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని కూడా ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story