OG: హైలైట్​.. వెయ్యి మందితో పవన్​కల్యాణ్​ ఫైట్​..!

Pawan Kalyan: 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో పవన్ కళ్యాణ్

Jyothi
Updated on: 17 April 2023 9:31 PM IST
Power Star is Going to Fight with 1000 People For the First Time
X

Pawan Kalyan: మొదటిసారిగా 1000 మందితో ఫైట్ చేయబోతున్న పవర్ స్టార్

Pawan Kalyan: ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. "జనసేన" పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేతుల్లో బోలెడు రాజకీయ పనులు ఉన్నాయి. మరోవైపు హీరోగా కూడా తన కెరీర్ ను కొనసాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్ద పూర్తి చేయాల్సిన సినిమా షూటింగులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందు తన సినిమా షూటింగులను త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే పట్టా లెక్కించారు. ముంబైలో ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి మొదలు కాబోతోంది.

పవన్ కళ్యాణ్ తో చిత్ర బృందం ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. చిత్ర మొదటి షెడ్యూల్ కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి కాబోతుందట. కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ షూటింగ్ షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారు. సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఈ 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఫైట్ సీన్లో నటించబోతున్నారు.

ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. దాదాపు 1000 మందితో పవన్ కళ్యాణ్ షూటింగ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలలో ఎక్కువగా కనిపిస్తారు. చూస్తూ ఉంటే సుజిత్ ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్ లో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story