Major Movie: వాయిదా పడిన అడివి శేష్ సినిమా...

Major Movie: "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మరియు నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మేజర్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం.

admin1
Updated on: 26 Jan 2022 3:00 PM IST
Postponed Adivi Seshs Major Movie | Tollywood News Today
X

వాయిదా పడిన మరొక పెద్ద సినిమా

Adivi Sesh: "ఎవరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమాతోనే బిజీగా నే ఉన్నారు. శశి కిరణ్ టిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. 2008 ముంబై అటాక్ ఆధారంగా అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. నిజానికి ఈ సినిమాని ఫిబ్రవరి 11 న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.

"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మరియు నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మేజర్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. భారత దేశం కోసం తీసిన సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడ్డాక విడుదలవుతుంది. అప్పటివరకు అందరూ జాగ్రత్తగా ఉండండి" అని ప్రకటించారు అడవి శేష్. శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి నాయర్, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story