"ఆర్ ఆర్ ఆర్" తో మాయం కాబోతున్న సినిమాలు

"ఆర్ ఆర్ ఆర్" తో మాయం కాబోతున్న సినిమాలు

admin1
Updated on: 21 March 2022 6:30 PM IST
Position of other Films After the Release of RRR Movie | Telugu News
X

"ఆర్ ఆర్ ఆర్" తో మాయం కాబోతున్న సినిమాలు

RRR Movie: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య మార్చి 25, 2022 న విడుదలకు సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదల కాబోతుండడంతో దర్శకనిర్మాతలు ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ లతో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం థియేటర్లలో కొన్ని పెద్ద సినిమాలు ఆడుతూనే ఉన్నాయి.

ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మరియు రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ సినిమాలు ఇంకా థియేటర్ల లోనే ఉన్నాయి. మరోవైపు హిందీ సినిమాలు కూడా కొన్ని థియేటర్లలోనే ఉండి మంచి కలెక్షన్లు అందుకుంటున్నాయి. కాశ్మీర్ ఫైల్స్, గాంగుభాయి కథియవాడి, బచ్చన్ పాండే వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ రాకతో ఈ సినిమాలన్నీ థియేటర్ల నుంచి మాయం అయిపోతాయి అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ మొదటి రోజు నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తే అన్ని థియేటర్లలోనూ "ఆర్ ఆర్ ఆర్" సినిమానే ఆడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

admin1

admin1

Next Story