Posani: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడిన పోసాని

Posani: రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేనాని కామెంట్స్ కాక ఇంకా చల్లారలేదు.

Arun Chilukuri
Updated on: 27 Sept 2021 9:00 PM IST
Posani Krishna Murali Comments on Pawan Kalyan
X

Posani: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడిన పోసాని

Posani: రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేనాని కామెంట్స్ కాక ఇంకా చల్లారలేదు. వైసీపీ మంత్రుల ఎదురుదాడి పూర్తికాక ముందే సొంతింటి నుంచి సెగలు మొదలయ్యాయి. తాజాగా ఈ మొత్తం ఎపిసోడ్‌పై రియాక్ట్ అయిన పోసాని కృష్ణ మురళి.. జనసేనానిపై ఓరేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆధారాలు లేకుండా అవాకులు చెవాకులు పేలడమేంటని ప్రశ్నించారు. అవకాశాల పేరుతో పంజాబ్ యువతిని ఓ వ్యక్తి మోసం చేసి, చంపేస్తామని బెదిరిస్తే.. బాధితురాలికి న్యాయం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. ఆ యువతి విషయంలో పవన్ న్యాయం చేస్తే గుడి కడతానంటూ హాట్ కామెంట్స్ చేశారు.

సీఎం జగన్‌తో పోల్చుకునే వ్యక్తిత్వం పవన్‌ కల్యాణ్‌కు లేదని అన్నారు. పవన్‌ మాట్లాడిన బాష సరిగా లేదన్నారు పోసాని. చిరంజీవి నోటి నుంచి అమర్యాద పదాలు ఎప్పుడైనా వచ్చాయా అని ప్రశ్నించారు. చిరంజీవితో రాజకీయంగా అభిప్రాయ బేధాలున్న ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. రిపబ్లిక్‌ సినిమా ఫంక్షన్‌లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని పోసాని నిలదీశారు. పవన్‌ కల్యాణ్‌ రెండు నియోజక వర్గాల్లో ఉన్నారు. రెండు చోట్ల తిరిగారు, ఒక్కచోట అయినా గెలవగలిగారా అని పోసాని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story