ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన హాస్యనటుడు

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన హాస్యనటుడు
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా తన 36 వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. స్టార్ హీరో కంటే గ్రాండ్గా అతని అభిమానులు ఎన్టీఆర్ పుట్టిన రోజును జరుపుకున్నారని...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా తన 36 వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. స్టార్ హీరో కంటే గ్రాండ్గా అతని అభిమానులు ఎన్టీఆర్ పుట్టిన రోజును జరుపుకున్నారని చెప్పచ్చు. తాజాగా సోమవారం నాడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మియాపూర్ లో జనప్రియ అపార్ట్మెంట్ లోని టీమ్ తారక్ ట్రస్ట్ వారు ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి ఎన్టీఆర్ అభిమానులు విచ్చేసి రక్తదానం చేశారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ కమెడియన్ కూడా రక్తదానం లో లో పాల్గొన్నారు.

అతనే రఘు కారుమంచి. ఎన్టీఆర్ తో 'అదుర్స్' వంటి చిత్రాలలో కలిసి నటించిన రఘు కారుమంచి కూడా రక్తదానం చేశారు. అనంతరం నిర్వహకుడు ప్రశాంతి చౌదరి మీడియాతో మాట్లాడుతూ హీరోల మీద అభిమానం సమాజానికి మేలు జరిగేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినీత్, భరత్, అజయ్, వంశీ, ఫణి తదితరులు పాల్గొన్నారు. ఇక సినిమాల పరంగా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories