logo

రెండవ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

రెండవ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
Highlights

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండవ పెళ్లి పై ఒకప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగిన సంగతి తెలిసింది....

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండవ పెళ్లి పై ఒకప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగిన సంగతి తెలిసింది. కానీ ఈ మధ్య ఆమె పెళ్లి గురించి ఒక అప్డేట్ కూడా బయటకు రావడం లేదు. ఆమె నిశ్చితార్థం సమయంలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెపై వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లేచారు. ఒక రేంజ్ లో ఆమెను ట్రోల్ చేశారు. ఇక పెళ్లి సమయంలో భౌతిక దాడులు పడతారేమో అని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కొందరు ప్రచారం చేయసాగారు. అయితే మరికొందరు మాత్రం ఏకంగా పెళ్లి క్యాన్సిల్ అయిందేమో అని కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు రేణుదేశాయ్.

తాను దొంగ పెళ్లి చేసుకోలేదని తన పెళ్లికి హడావుడి ఏమీ లేదని అంతా సాఫీగా సజావుగా జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లికి సంబంధించిన విషయాలను త్వరలోనే అందరితోనూ పంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ఇక కాబోయే భర్త గురించి మాట్లాడుతూ అతను అమెరికా నుండి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండియాకు వచ్చి ప్రస్తుతం పూణేలో ఒక ఐటి కంపెనీలో డైరెక్టరుగా పని చేస్తున్నాడని వెల్లడించిండించారు రేణూ దేశాయి. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన పనులు చూసుకుంటున్నారు అని ఆమె చెప్పుకొచ్చింది.

లైవ్ టీవి

Share it
Top