Poorna: పూర్ణ 'బ్యాక్‌ డోర్‌' నుంచి 'నోరే ఊరేలా... కూరే కావాలా' సాంగ్ రిలీజ్

Poorna New Movie
x

పూర్ణ ఫైల్ ఫోటో 

Highlights

Poorna: 'శ్రీ మ‌హాల‌క్ష్మి' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూర్ణ‌.

Poorna: 'శ్రీ మ‌హాల‌క్ష్మి' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూర్ణ‌. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును' చిత్రంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ త‌రువాత ఆమెకు మంచి ఆఫ‌ర్లు కూడా వ‌చ్చాయి. చిన్న చిన్న పాత్ర‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఓ ప్రముఖ చానల్ లో ప్ర‌సారం అవుతున్న రియాలిటీ షో ఢీకు జ‌డ్జ్‌గా చేస్తుంది. పూర్ణ ఇప్పుడు మ‌ళ్లీ బిజీ అవుతున్నారు. రాజ్ త‌రుణ్ ప‌వ‌ర్ ప్లేలో విల‌న్‌గా న‌టించి మెప్పించింది. ఆ తర్వాత వరుసగా ఆమె ఆఫర్లు వస్తున్నాయి.

తేజ త్రిపురాన , పూర్ణ ప్రధాన పాత్రలలో కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్యాక్‌ డోర్‌'. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సతీష్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని 'నోరే ఊరేలా... కూరే కావాలా' అంటూ సాగే గీతాన్ని పాకశాస్త్ర నిపుణుడు సంజయ్‌ తుమ్మ విడుదల చేశారు. వంట నేపథ్యంలో సాగే ఈ గీతాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారాయన.ఈ సినిమాకు ప్రనవ్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం పూర్ణ ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ- బోయ‌పాటి మూవీలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే సుంద‌రి, బ్యాక్ డోర్, తెలుగులో నాకు న‌చ్చ‌ని ప‌దం ప్రేమ‌లో న‌టిస్తోంది. ఇక జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా త‌మిళ చిత్రం త‌లైవిలో వీకే శ‌శిక‌ళ పాత్ర‌లో న‌టించారు. వెంకటేశ్ దృశ్యం-2లో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది పూర్ల కన్నమూచి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories