Poonam Kaur: బావ మూవీ హిట్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

Poonam Kaur Tweet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 25 Feb 2022 7:25 PM IST
Poonam Kaur Tweet Viral in Social Media
X

Poonam Kaur: బావ మూవీ హిట్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

Poonam Kaur Tweet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చూసి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు. హీరోయిన్ పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బావ సినిమాకి వచ్చాను అక్కా అంటూ ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది. దానికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా కళ్ళు మూసుకున్న ఎమోజీలను పెడుతూ.. సినిమా ఎలా ఉందో చెప్పమని హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది. దానికి అవతలి వ్యక్తి కూడా ఒకే అన్నారు. ఆ తర్వాత అతను సినిమా హిట్టు నిజంగా చెప్తున్నా అక్కా సినిమా సూపర్ హిట్టు అంటూ చాట్ చేశాడు. ఇది ఎవరితో ఆమె చాట్ చేసిందో.. ఏ సినిమా గురించి వీళ్ళు మాట్లాడుకున్నారో.. చాట్ చేసిన వ్యక్తి ఏ సినిమాకి వెళ్ళాడో.. ఇంతకీ ఈ బావ ఎవరన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story