Poonam Kaur: అబార్షన్‌పై సుప్రీంకోర్టు తీర్పు.. పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు..

Poonam Kaur: ఎలాంటి విషయాలలో నైనా తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయపడకుండా చెప్పే నటి పూనమ్ కౌర్.

Arun Chilukuri
Published on: 30 Sept 2022 12:01 PM IST
Poonam Kaur Reacts to Supreme Court Order on Abortion
X

Poonam Kaur : అబార్షన్‌పై సుప్రీంకోర్టు తీర్పు.. పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు..

Poonam Kaur: ఎలాంటి విషయాలలో నైనా తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయపడకుండా చెప్పే నటి పూనమ్ కౌర్. ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే పూనంకు దేవుడు అంటే ఎంతో భక్తి కూడా ఉంది. తాజాగా అభార్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. గురువారం నాడు 14 నుంచి 20 వారాల లోపు ఉన్న ప్రెగ్నెంట్ యువతులకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని, ఒకవేళ పెళ్లి అయినా కాకపోయినా ఒక స్త్రీకి అబార్షన్ చేయించుకునే హక్కు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

తాజాగా దీని గురించి సానుకూలంగా స్పందించింది పూనమ్. ఈ మధ్యకాలంలో అమ్మాయిలకు ఇష్టం లేకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని వారికి ఇష్టం లేకుండానే గర్భవతులు అవుతున్నారని చెబుతోంది. "ఎంతోమంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఇష్టం లేకుండానే గర్భవతులయ్యి ఆర్థికంగా సెక్యూరిటీ కోసం భర్తతో ఉండే వాళ్ళని చాలామందిని చూశాను. అసలు మగాళ్లు ఆడవాళ్లను కేవలం పిల్లలని కనే మెషిన్ లాగా చూడకూడదు," అని షాకింగ్ కామెంట్స్ చేసింది పూనం. గత కొన్నాళ్లుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story