వాళ్ళని చంపి నేను జైలుకి వెళ్తాను : పూనం కౌర్

ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ క్రూరమృగాలు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకెళతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పూనం

Krishna
Updated on: 24 July 2020 12:36 AM IST
poonam kaur
X
poonam kaur

హైదరాబాద్‌ శివారులో వెటర్నరీ డాక్టర్‌ ను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపిన సంగతి తెలిసిందే.. ఇంతటి దారుణానికి తెగించిన వారిని ఊరికే వదిలి పెట్టకూడదని, బహిరంగంగానే ఉరి తీయాలని అందరు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి చర్లపల్లి జైలుకు తరలించే క్రమంలో ఒక్కొక్కరు ఆగ్రహంతో ఊగిపోయారు. వారిని జైలుకి పంపించవద్దునని మాకు అప్పజెప్పండి మేము న్యాయం చేస్తాం అంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపైన మామలు ప్రజల మాత్రమే కాదు సెలబ్రేటిల కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సినీ నటి పూనం కౌర్ సోషల్ మీడియా ద్వారా వీడియో రూపకంగా స్పందించారు.

ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ క్రూరమృగాలు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకెళతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పూనం . అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే కొందరు మనుషులు అతిభయంకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.నిందితుల్లో ఒక వ్యక్తి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతమనేది సమస్య కానేకాదని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఆలోచించాలి కానీ మత, రాజకీయ రంగులు పులిమి తప్పదోవ పట్టించొద్దని ఆ వీడియోలో పేర్కొన్నారు పూనం ..

Krishna

Krishna

Next Story