Bigg Boss 7 Telugu: ఉన్నది 2 వారాలే.. రెమ్యునరేషన్‌ మాత్రం భారీగానే పట్టేసిన పూజామూర్తి..!

Bigg Boss 7 Telugu: ఇదేందయ్యా.. ఇది.. బిగ్ బాస్ హౌస్ నుంచి వరుసగా లేడీస్ మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు.. అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

Shekhar G
Published on: 23 Oct 2023 12:06 PM IST
Pooja Murthy 2 Weeks Remuneration In Bigg Boss Telugu Season 7 Check Here
X

Bigg Boss 7 Telugu: ఉన్నది 2 వారాలే.. రెమ్యునరేషన్‌ మాత్రం భారీగానే పట్టేసిన పూజామూర్తి..!

Bigg Boss 7 Telugu: ఇదేందయ్యా.. ఇది.. బిగ్ బాస్ హౌస్ నుంచి వరుసగా లేడీస్ మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు.. అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. గత 6 వారాలుగా ఇదే జరిగింది. ఇక 7వ వారం వెరైటీగా ఉంటుందేమోనని అంతా ఎదురుచూశారు. కానీ, 7వ వారం కూడా అమ్మాయే ఇంటి నుంచి బయటకు వచ్చింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో 5వ వారం బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి.. 2 వారాలకే రిటన్ అయ్యింది. దీంతో ఈమె కూడా కిరణ్‌ రాథోడ్‌, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్‌, శుభ శ్రీ, నయని జాబితాలో చేరింది. కాగా, ఈ సీరియల్‌ యాక్టర్ బిగ్ బాస్ హౌజ్‌ లోకి తొలుతే అడుగుపెట్టాల్సి ఉంది. కానీ, ఆమె తండ్రి చనిపోవడంతో కుదరలేదు. దీంతో వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఐదో వారం హౌస్‌లోకి వచ్చింది. లేట్‌గా హౌజ్‌లోకి రావడమే కాకుండా.. సీరియల్ బ్యాచ్‌తో జాయిన్ అయింది. అదే బ్యాచ్‌లోని మరో కంటెస్టెంట్‌ అశ్విని శ్రీతో చీటికి మాటికీ గొడవ పడుతూనే ఉంది. ఇక టాస్కుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఎలిమినేషన్ కారణం అదే..

కాగా, 7వ వారం సింగర్‌ భోలే షా వళి, అశ్విని, పూజా మూర్తి నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ ముగ్గురిలోపూజా మూర్తికి చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. దీంతో హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది.

అయితే, పూజా మూర్తి ఉన్నది 2 వారాలే అయినా.. వారానికి రూ. 1.5లక్షల రెమ్యూనరేషన్‌ తీసుకుందంట. అంటే మొత్తం 2 వారాలకు కేవలం రూ. 3 లక్షలు వసూళ్లు చేసిందంట. అయితే, ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్‌లో చాలా తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్నది పూజా మూర్తే కావడం గమనార్హం.

Shekhar G

Shekhar G

Next Story