Samantha - Pooja Hegde: సమంతను మించిపోయిన పూజా హెగ్డే.. ఒక్క సాంగ్ కు 1.75 కోట్లు...

Samantha - Pooja Hegde: పూజ హెగ్డే ప్రభాస్ హీరోగా నటించిన "రాధే శ్యామ్" సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు.

Shireesha
Updated on: 21 April 2022 6:30 PM IST
Pooja Hegde Taking Remuneration Higher than Samantha for Item Songs | Tollywood News
X

Samantha - Pooja Hegde: సమంతను మించిపోయిన పూజా హెగ్డే.. ఒక్క సాంగ్ కు 1.75 కోట్లు...

Samantha - Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజ హెగ్డే ప్రభాస్ హీరోగా నటించిన "రాధే శ్యామ్" సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ తో నటించిన "బీస్ట్" కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇక తాజాగా పూజా హెగ్డే ఇప్పుడు ఒక ఐటెం పాటతో అందరి దృష్టిని ఆకర్షించబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో వెంకీ మరియు వరుణ్ తేజ్ ల తో కలిసి స్టెప్పులెయ్యబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే మరోవైపు ఐటమ్ సాంగ్స్ తో కూడా మంచి రెమ్యునరేషన్ను అందుకుంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఒక్క పాట కోసం పూజ హెగ్డే ఏకంగా 1.75 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్టార్ బ్యూటీ సమంత కూడా పుష్ప సినిమాలో ఐటెం పాట కోసం 1.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది.

ఇప్పుడు పూజ హెగ్డే అంతకంటే ఎక్కువ తీసుకుని ఈ రికార్డును బద్దలు కొట్టింది. మరోవైపు ఇద్దరు హీరోయిన్లు కూడా బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెమ్యునరేషన్ పరంగా సమంత ని బీట్ చేసిన పూజ హెగ్డే బాలీవుడ్ సినిమా ఆఫర్ల విషయంలో కూడా సమంతను దాటుతుందా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Shireesha

Shireesha

Next Story