అందుకే "రాధే శ్యామ్" ప్రమోషన్ల కి దూరంగా ఉంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 18 Feb 2022 3:46 PM IST
Pooja Hegde Skip Radhe Shyam Promotions?
X

అందుకే "రాధే శ్యామ్" ప్రమోషన్ల కి దూరంగా ఉంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో జనవరి 14 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వచ్చే నెలకు వాయిదా పడింది. ఒకవైపు చిత్రబృందం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉండగా మరోవైపు పూజా హెగ్డే మాత్రం మీడియా ముందుకు రాకుండా అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అయితే రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్ లో కి రాకపోవడం వెనుక పూజా హెగ్డే కి ఒక కారణం కూడా ఉంది. వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న పూజాహెగ్డే చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి.

ఒకవైపు తెలుగు తమిల్ మరోవైపు హిందీ సినిమాలతో కూడా వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నా పూజ హెగ్డే కి సినిమా ప్రమోషన్స్ కి రావటం కుదరటంలేదు. అయితే మరోవైపు రాధేశ్యామ్ బృందం నార్త్ లో కూడా ఒక పెద్ద రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోంది. కనీసం ఈ ఈవంట్ కైన పూజా హెగ్డే వస్తుందో లేదో అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఒకవేళ ఈ ఈవెంట్ కి కూడా పూజా హెగ్డే రాలేకపోతే అభిమానులు హర్ట్ అవుతారు అని చెప్పుకోవచ్చు. ఫాంటసీ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story